Alert: ఈ నెల 19న ఆన్లైన్ ఎగ్జామ్
ABN , First Publish Date - 2021-12-09T16:42:45+05:30 IST
ఈ నెల 19న..

19న ‘ T.I.M.E ’ టాలెంట్ సెర్చ్ ఎగ్జామ్
పోటీ పరీక్షల కోచింగ్ సంస్థ ‘టైమ్’ డిసెంబరు 19న ఆన్లైన్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామ్‌ను నిర్వహిస్తోంది. క్లాట్/ఐపీఎం/బీబీఏ అండ్ హెచ్ఎం 2022/23కు ప్రిపేరవుతున్న అభ్యర్థుల కోసం ఈ పరీక్షను ఉద్దేశించారు. ఈ టెస్ట్‌ను రెండు స్లాట్లలో ఉదయం 10 గంటలకు, సాయంత్రం 6 గంటలకు నిర్వహించనున్నారు.
ఈ పరీక్షలో ప్రతిభ కనబరచిన వారికి ఆన్లైన్/ఆఫ్‌లైన్ కోచింగ్ ఫీజులో 100 శాతం వరకు రాయితీని కల్పించనున్నట్లు ‘టైమ్’ తెలిపింది. కాగా, ఈనెల 19లోపు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారందరికీ ఫీజులో కనీసం 10 శాతం డిస్కౌంట్ లభించనుంది. ఆసక్తి ఉన్నవారు కింద ఇచ్చిన రిజిస్ట్రేషన్ లింక్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు.
రిజిస్ట్రేషన్ లింక్: https://www.time4education.com/local/articlecms/page.php? id=4876
