విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులు ప్రారంభించాలి

ABN , First Publish Date - 2021-08-10T17:03:55+05:30 IST

కరోనా తీవ్రత తగ్గడంతో అన్ని కార్యకలాపాలు యధావిధిగా సాగుతున్నందున విద్యార్థులకు కూడా ప్రత్యక్ష తరగతులను ప్రారంభించాలని యునైటెడ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ (యూటీఎఫ్‌) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. స్కూళ్లు ప్రారంభించుకోవచ్చని

విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులు ప్రారంభించాలి

యూటీఎఫ్‌ డిమాండ్‌

హైదరాబాద్‌, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): కరోనా తీవ్రత తగ్గడంతో అన్ని కార్యకలాపాలు యధావిధిగా సాగుతున్నందున విద్యార్థులకు కూడా ప్రత్యక్ష తరగతులను ప్రారంభించాలని యునైటెడ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ (యూటీఎఫ్‌) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. స్కూళ్లు ప్రారంభించుకోవచ్చని వైద్య నిపుణులు సైతం స్పష్టం చేస్తున్నారని యూటీఎఫ్‌ పేర్కొంది. పార్లమెంటరీ కమిటీ కూడా స్కూళ్లను ప్రారంభించాలని సూచించినట్టు గుర్తుచేసింది. పలు రాష్ర్టాల్లో పాఠశాలల ప్రారంభానికి ప్రభుత్వాలు సన్నాహాలు చేస్తున్నందున తెలంగాణలో కూడా స్కూళ్లను తె రవాలని కోరింది. ఎక్కువమంది తల్లిదండ్రులు పాఠశాలల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభించాలని కోరుతున్నారని తెలిపింది. ఈ మేరకు యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావా రవి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రత్యక్ష బోధన లేకపోతే విద్యార్థులు మరో విద్యా సంవత్సరం నష్టపోయే పరిస్థితి ఏర్పడవచ్చని వారు ఆందోళన వ్యక్తం చేశారు.


విలేజ్‌ లెర్నింగ్‌ సర్కిల్స్‌ (వీఎల్‌సీలు) నిర్వహిస్తూ ఫార్మేటివ్‌ అసె్‌సమెంట్‌ (ఎఫ్‌ఏ) పరీక్షలు నిర్వహించడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పాఠశాలలో ఎఫ్‌ఏ పేపర్లు సమర్పించడానికి వెళ్తూ ప్రమాదానికి గురై... వికారాబాద్‌ జిల్లా పరిగి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న నగేష్‌ అనే విద్యార్థి మృతి చెందిన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తుచేశారు. ప్రభుత్వం వెంటనే వీఎల్‌సీలు, ఎఫ్‌ఏ పరీక్షలను ఆపేసి ప్రత్యక్ష తరగతులను ప్రారంభించాలని యూటీఎఫ్‌ నేతలు డిమాండ్‌ చేశారు.

Updated Date - 2021-08-10T17:03:55+05:30 IST