జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన సీఎం జేబులో నుంచి ఇస్తున్నారా?

ABN , First Publish Date - 2021-12-28T21:53:11+05:30 IST

జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన ముఖ్యమంత్రి జేబులో నుంచి ఇస్తున్నారా? అని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కేంద్రం కూడా నిధులు ఇస్తోందని...

జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన సీఎం జేబులో నుంచి ఇస్తున్నారా?

నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు నిలదీత


ఢిల్లీ: జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన ముఖ్యమంత్రి జేబులో నుంచి ఇస్తున్నారా? అని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కేంద్రం కూడా నిధులు ఇస్తోందని, మరి జగనన్న పేరు ఏంటని నిలదీశారు. ప్రభుత్వం ఖర్చుతో ఇష్టానుసారంగా పార్టీ పేరు మీద ప్రకటనలు ఇస్తున్నారని ఆరోపించారు. సమాచార శాఖ కార్యదర్శికి అసలు బుద్ధి ఉందా? అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి బెయిల్‌పై ఉండి రెండున్నరేళ్ల నుంచి కోర్టుకు రావడం లేదన్నారు. ఏదో ఒక కారణంతో సినిమా థియేటర్లు మూసి వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హీరోలను గెలికి సూపర్ హీరోల్లా ఫీల్ అవుతున్నారని ఎద్దేవా చేశారు. సినిమా సమస్యకు ఒక పరిష్కారం చూపాలని రఘురామ ఏపీ ప్రభుత్వానికి సూచించారు.

Updated Date - 2021-12-28T21:53:11+05:30 IST