పలాస వీఆర్వోలకు మునిసిపల్‌ కమిషనర్‌ ‘సారీ’

ABN , First Publish Date - 2021-12-07T15:29:57+05:30 IST

శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ..

పలాస వీఆర్వోలకు మునిసిపల్‌ కమిషనర్‌ ‘సారీ’

పలాస, డిసెంబరు 6: శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ మునిసిపల్‌ కమిషనర్‌ రాజగోపాలరావు వీఆర్వోలకు సారీ చెప్పారు. తప్పయిందంటూ.. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. సబ్‌ కలెక్టర్‌ జోక్యం చేసుకుని  మునిసిపల్‌ కమిషనర్‌ రాజగోపాలరావుతో వారికి క్షమాపణలు చెప్పించారు. దీంతో వీఆర్వోలకు మునిసిపల్‌ కమిషనర్‌కు మధ్య కొన్ని రోజులుగా జరుగుతున్న వివాదం సద్దుమణిగింది. మరోవైపు మంత్రి అప్పలరాజు వ్యాఖ్యలపై వివాదం కొనసాగుతూనే ఉంది.

Updated Date - 2021-12-07T15:29:57+05:30 IST