మధ్యాహ్న భోజనం వికటించి 70 మందికి అస్వస్థత

ABN , First Publish Date - 2021-10-28T15:14:06+05:30 IST

కామారెడ్డి జిల్లా బీర్కూర్‌ ప్రాథమిక పాఠశాలలో..

మధ్యాహ్న భోజనం వికటించి 70 మందికి అస్వస్థత

ప్రధానోపాధ్యాయుడి సస్పెన్షన్‌


బీర్కూర్‌, అక్టోబరు 27 : కామారెడ్డి జిల్లా బీర్కూర్‌ ప్రాథమిక పాఠశాలలో బుధవారం మధ్యాహ్న భోజ నం వికటించి సుమారు 70మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలో రోజూలాగే మధ్యా హ్నం 264 మంది విద్యార్థులు  భోజనం చేశారు. 70 మంది విద్యార్థులు సాయంత్రం వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు.  విద్యార్థులను బాన్సువాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అందరి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉంది. ఉడకని అన్నం, కుళ్లిన కోడిగుడ్లు పెట్టడం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న స్పీకర్‌ పోచారం శ్రీనివా్‌సరెడ్డి ప్రభుత్వాస్పత్రికి చేరుకొని విద్యార్థులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.  విద్యార్థులకు మె రుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఈ ఘటనకు సంబంధించి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అన్నం సంతో్‌షను డీఈఓ రాజు సస్పెండ్‌ చేశారు. ఆయన నిర్లక్ష్య వల్లే ఇలా జరిగిందని డీఈఓ చెప్పారు. 

Updated Date - 2021-10-28T15:14:06+05:30 IST