రేపే ఎల్పీ సెట్.. పది రోజుల్లో ఫలితాలు
ABN , First Publish Date - 2021-07-24T16:31:43+05:30 IST
ఐటీఐ చదివిన వారు పాలిటెక్నిక్ రెండో సంవత్సరంలో ప్రవేశం పొందేందుకు రాసే ఎల్పీ సెట్ పరీక్ష ఆదివారం నిర్వహించనున్నట్లు

ఐటీఐ చదివిన వారు పాలిటెక్నిక్ రెండో సంవత్సరంలో ప్రవేశం పొందేందుకు రాసే ఎల్పీ సెట్ పరీక్ష ఆదివారం నిర్వహించనున్నట్లు సాంకేతిక విద్య, శిక్షణ కార్యదర్శి డాక్టర్ సి.శ్రీనాథ్ తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష కొనసాగుతుందని, ఫలితాల్ని పది రోజుల్లోగా వెల్లడిస్తామని ఓ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు.