RGUKT కౌన్సెలింగ్‌కు కాల్‌ లెటర్లు

ABN , First Publish Date - 2021-10-29T14:27:17+05:30 IST

రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌..

RGUKT కౌన్సెలింగ్‌కు కాల్‌ లెటర్లు

అమరావతి, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ అండ్‌ టెక్నాలజీ (ఆర్జీయూకేటీ) ప్రవేశాల్లో భాగంగా జనరల్‌ కౌన్సెలింగ్‌ కోసం కాల్‌ లెటర్లు పంపించామని ఉన్నత విద్యామండలి చైర్మన్‌ కె.హేమచంద్రారెడ్డి తెలిపారు. అలాగే ఎన్‌ఆర్‌ఐలు ప్రత్యేకంగా సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యేందుకు కాల్‌ లెటర్లు పంపించామని చెప్పారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. జనరల్‌ కౌన్సెలింగ్‌కు హాజరయ్యేవారు తెచ్చుకోవాల్సిన సర్టిఫికెట్ల వివరాలను అభ్యర్థులకు పంపిన కాల్‌ లెటర్స్‌లో పేర్కొన్నామన్నారు. ఆర్జ్జీయూకేటీ విద్యాసంస్థల్లో చేరాలనుకునే ఎన్‌ఆర్‌ఐలు నవంబరు 20లోగా ఆర్జీయూకేటీ.ఇన్‌ వెబ్‌సైట్‌లో రిజిస్టరు చేసుకోవాలన్నారు. నవంబరు 30న సర్టిఫికెట్ల పరిశీలన కోసం నూజివీడు, ఆర్కే వ్యాలీ క్యాంప్‌సలలో ఎక్కడికైనా హాజరు కావొచ్చని తెలిపారు.

Updated Date - 2021-10-29T14:27:17+05:30 IST