విద్యా వలంటీర్ల నియామకంపై స్పష్టత కరువు

ABN , First Publish Date - 2021-08-27T16:06:21+05:30 IST

విద్యా వలంటీర్ల నియామకంపై ప్రభుత్వం వైపు నుంచి ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు సెప్టెంబరు 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఏటా విద్యా సంవత్సరం మొదలైన

విద్యా వలంటీర్ల నియామకంపై స్పష్టత కరువు

హైదరాబాద్‌, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): విద్యా వలంటీర్ల నియామకంపై ప్రభుత్వం వైపు నుంచి ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు సెప్టెంబరు 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఏటా విద్యా సంవత్సరం మొదలైన తర్వాత వలంటీర్లను నియమిస్తారు. ఈసారి ప్రభుత్వం దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. దీంతో అసలు ఈ ఏడాది  నియామకాలు ఉంటాయా? అన్న అనుమానం నెలకొంది.


ప్రతి జూనియర్‌ కాలేజీలో రెండు ఐసోలేషన్‌ గదులు

రాష్ట్రంలోని ప్రతి జూనియర్‌ కాలేజీలో రెండు ఐసోలేషన్‌ గదులను ఏర్పాటు చేయాలని ఇంటర్‌ బోర్డు నిర్ణయించింది. ప్రత్యక్ష క్లాసుల నిర్వహణపై ఇంటర్‌ బోర్డు కమిషనర్‌ ఉమర్‌ జలీల్‌ తాజాగా మెమో జారీ చేశారు. కాగా, నోటిఫికేషన్‌ జారీ చేయకుండా బి-కేటగిరీ (మేనేజ్‌మెంట్‌ కోటా) ఇంజనీరింగ్‌ సీట్లను భర్తీ చేసే కాలేజీలపై చర్యలు తీసుకోనున్నట్టు తెలంగాణ అడ్మిషన్‌ అండ్‌ ఫీ రెగ్యులేటరీ కమిటీ (ఏఎ్‌ఫఆర్‌సీ) స్పష్టం చేసింది. నిబంధనలను పాటించకుండా అనేక ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలు బి-కేటగిరీ సీట్లను భర్తీ చేస్తున్నాయని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్‌రెడ్డి కమిటీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై ఏఎ్‌ఫఆర్‌సీ స్పందించింది.  నోటిఫికేషన్‌ ద్వారానే మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల భర్తీని చేపట్టాలని ప్రైవేటు కాలేజీలకు సూచించింది.


Updated Date - 2021-08-27T16:06:21+05:30 IST