డీఆర్‌డీవోలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.. పోస్టును బట్టి నెలకు రూ.54వేల వరకు వేతనం
ABN , First Publish Date - 2021-09-03T17:13:15+05:30 IST
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఢిల్లీలోని డీఆర్‌డీవో-ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అల్లైడ్ సైన్స్(

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఢిల్లీలోని డీఆర్‌డీవో-ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అల్లైడ్ సైన్స్(ఐఎన్‌ఎంఏఎస్) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీలు 10
1.రీసెర్చ్ అసోసియేట్(ఆర్‌ఏ): 04
విభాగాలు: లైఫ్ సైన్స్, కెమిస్ట్రీ, ఫార్మా
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టులో పీహెచ్‌డీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 35 సంవత్సరాలు మించకూడదు
జీతభత్యాలు: నెలకు రూ.54,000+హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు.
2.జూనియర్ రీసెర్చ్ ఫెలోషి్‌ప(జేఆర్‌ఎఫ్): 06
విభాగాలు: లైఫ్ సైన్స్, కెమిస్ట్రీ, ఫార్మా, ఫిజిక్స్
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఎమ్మెస్సీ/బీటెక్/ఎంఫార్మా, ఎంటెక్ ఉత్తీర్ణత. నెట్/గేట్ అర్హత ఉండాలి.
వయసు: 28 సంవత్సరాలు మించకూడదు
జీతభత్యాలు: నెలకు రూ.31,000+హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా
ఈమెయిల్: inmasrf@gmail.com
దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబరు 24
వెబ్‌సైట్: https://www.drdo.gov.in/