జేఈఈ-మెయిన్స్ వాయిదా
ABN , First Publish Date - 2021-05-05T16:43:40+05:30 IST
ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం మే 24 నుంచి 28 వరకు జరగాల్సిన జేఈఈ-మెయిన్స్ పరీక్ష లు

న్యూఢిల్లీ, మే 4: ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం మే 24 నుంచి 28 వరకు జరగాల్సిన జేఈఈ-మెయిన్స్ పరీక్ష లు వాయిదా పడ్డాయి. కరోనా వ్యాప్తి కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ ప్రకటించింది. వాటి రిజిస్ట్రేషన్ల తేదీలపై మళ్లీ ప్రకటన చేస్తామని తెలిపింది. కాగా, జేఈఈ-మెయిన్స్ ఏప్రిల్ ఎడిషన్ పరీక్షలు కూడా వాయిదా పడిన విషయం తెలిసిందే.