నేటి నుంచి ఇంటర్‌ ఫస్టియర్‌ హాల్‌ టికెట్లు

ABN , First Publish Date - 2021-10-19T14:16:24+05:30 IST

ఇంటర్‌..

నేటి నుంచి ఇంటర్‌ ఫస్టియర్‌ హాల్‌ టికెట్లు

హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి): ఇంటర్‌ ప్రథమ సంవత్సరం రెగ్యులర్‌ విద్యార్థులకు థియరీ పరీక్షలు ఈనెల 25 నుంచి నవంబరు 3 వరకు జరగనున్నాయని ఇంటర్మీడియట్‌ విద్యామండలి కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ గుర్తుచేశారు. పరీక్షలు ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు జరుగుతాయన్నారు. మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి హాల్‌టికెట్లు వెబ్‌సైట్లో అందుబాటులో ఉంటాయని, విద్యార్థులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు. హాల్‌టికెట్‌లో పేరు, ఫొటో, మీడియం, సంతకం, ఇతర వివరాలలో ఏమైనా తప్పులుంటే విద్యార్థులు వెంటనే సంబంధిత కాలేజీ ప్రిన్సిపాల్‌ దృష్టికి తేవాలని సోమవారం ఒక ప్రకటనలో సూచించారు. 

Updated Date - 2021-10-19T14:16:24+05:30 IST