సుభాష్ రెడ్డి గారూ.. మీరే నిజమైన హీరో!
ABN , First Publish Date - 2021-11-11T15:21:28+05:30 IST
‘సుభాష్ రెడ్డి గారు.. శ్రీమంతుడు సినిమా స్ఫూర్తితో..

కామారెడ్డి సర్కారు బడి దాతకు మహేశ్ బాబు ప్రశంస
హైదరాబాద్(ఆంధ్రజ్యోతి): ‘సుభాష్ రెడ్డి గారు.. శ్రీమంతుడు సినిమా స్ఫూర్తితో కామారెడ్డిలో ప్రభుత్వ పాఠశాల భవనాన్ని నిర్మించడం చాలా గౌరవంగా భావిస్తున్నా. మీరే నిజమైన హీరో.. మీలాంటి మరింత మంది సమాజానికి కావాలి’ అంటూ సినీ నటుడు మహేశ్ బాబు ప్రశంసించారు. కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలం జనగామలో తాను చదువుకున్న పాఠశాల శిథిలావస్థలో ఉండటంతో రూ.6 కోట్ల సొంత నిధులతో రియల్టర్ సుభాష్ రెడ్డి కొత్త భవనాన్ని నిర్మించారు. దీనిని మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి మంగళవారం ప్రారంభించిన విషయం తెలిసిందే.
శ్రీమంతుడు సినిమా స్ఫూర్తితో దీనిని నిర్మించానని దాత సుభాష్ రెడ్డి పేర్కొనడంతో.. ఆ చిత్రంలో నటించిన నటుడు మహేష్ బాబును పాఠశాలకు తీసుకువస్తానని కేటీఆర్ పేర్కొన్నారు. దీనిపై మహేష్ బాబు బుధవారం ట్విట్టర్లో స్పందించారు. సుభాష్ రెడ్డిని ప్రశంసించారు. త్వరలో శ్రీమంతుడు బృందంతో కలిసి పాఠశాలను సందర్శిస్తాననని హామీ ఇచ్చారు.
