HYD: నిజాం కళాశాల చరిత్రలో.. మొదటిసారిగా..

ABN , First Publish Date - 2021-11-24T13:29:51+05:30 IST

నిజాం కళాశాల చరిత్రలో..

HYD: నిజాం కళాశాల చరిత్రలో.. మొదటిసారిగా..

జనవరిలో Nizam College స్నాతకోత్సవం


హైదరాబాద్/బర్కత్‌పుర: నిజాం కళాశాల చరిత్రలో మొదటిసారి 2022 జనవరి మొదటి వారంలో కళాశాల స్నాతకోత్సవం నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ బి.నారాయణ, వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సి.వి.రంజనీ, కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జాబినేషన్‌ ప్రొఫెసర్‌ బాలబ్రహ్మచారి తెలిపారు. మంగళవారం నిజాం కళాశాలలో విలేకరుల సమావేశంలో స్నాతకోత్సవ బ్రోచర్‌ను వారు ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ స్నాతకోత్సవానికి గవర్నర్‌ డాక్టర్‌ తమిళసై, మంత్రి కేటీఆర్‌తోపాటు కళాశాలలో చదివి ఉన్నత స్థాయికి ఎదిగిన మహ్మద్‌ అజారుద్దీన్‌, మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, రాకేష్‌శర్మ తదితరులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.

Updated Date - 2021-11-24T13:29:51+05:30 IST