ట్రిపుల్‌ ఐటీలో ఎంటెక్‌ ప్రోగ్రాం

ABN , First Publish Date - 2021-03-24T16:28:08+05:30 IST

ప్రోడక్ట్‌ డిజైన్‌ మెనేజ్‌మెంట్‌లో ఎంటెక్‌ ప్రోగ్రాంను ట్రిపుల్‌ ఐటీ ప్రకటించింది. పనిచేసే నిపుణుల కోసం ఉత్పత్తి రూపకల్పనలో రెండు సంవత్సరాల మాస్టర్‌ ప్రోగ్రాంను ప్రవేశపెడుతున్నామని ట్రిపుల్‌ ఐటీ అధికారులు తెలిపారు. సాంకేతిక ఉత్పత్తులను

ట్రిపుల్‌ ఐటీలో ఎంటెక్‌ ప్రోగ్రాం

రాయదుర్గం, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): ప్రోడక్ట్‌ డిజైన్‌ మెనేజ్‌మెంట్‌లో ఎంటెక్‌ ప్రోగ్రాంను ట్రిపుల్‌ ఐటీ ప్రకటించింది. పనిచేసే నిపుణుల కోసం ఉత్పత్తి రూపకల్పనలో రెండు సంవత్సరాల మాస్టర్‌ ప్రోగ్రాంను ప్రవేశపెడుతున్నామని ట్రిపుల్‌ ఐటీ అధికారులు తెలిపారు. సాంకేతిక ఉత్పత్తులను రూపకల్పన చేయడం, వాటిని మార్కెట్లకు అనుసంధానించడం వంటి అంశాలపై అవగాహన ఉన్న సాంకేతిక నిపుణులు, డిజైనర్లు, నిర్వాహకులు, ప్రారంభ వ్యవస్థాపకులను రూపొందించడమే లక్ష్యంగా ఈ కోర్సును ప్రవేశపెడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కోర్సులో ప్రవేశాలను ఇంటర్వ్యూ ఆధారంగా కల్పిస్తామని తెలిపారు.

Updated Date - 2021-03-24T16:28:08+05:30 IST