గ్రూప్‌-1 అప్పీళ్లపై విచారణ వాయిదా

ABN , First Publish Date - 2021-07-24T16:07:33+05:30 IST

గ్రూప్‌-1 ఇంటర్వూలతో పాటు తదుపరి చర్యలన్నింటినీ నిలిపివేస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ఏపీపీఎస్సీ, ఇంటర్వూకి ఎంపికైన అభ్యర్థులు దాఖలు చేసిన అప్పీళ్లపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. సింగిల్‌ జడ్జి వద్ద ఉన్న ప్రధాన

గ్రూప్‌-1 అప్పీళ్లపై విచారణ వాయిదా

ఆగస్టు 18కి వాయిదా వేసిన హైకోర్టు .. మధ్యంతర ఉత్తర్వులకు నో 

అమరావతి, జూలై 23(ఆంధ్రజ్యోతి): గ్రూప్‌-1 ఇంటర్వూలతో పాటు తదుపరి చర్యలన్నింటినీ నిలిపివేస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ఏపీపీఎస్సీ, ఇంటర్వూకి ఎంపికైన అభ్యర్థులు దాఖలు చేసిన అప్పీళ్లపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. సింగిల్‌ జడ్జి వద్ద ఉన్న ప్రధాన పిటిషన్‌ ఆగస్టు 9న విచారణకు రానున్న నేపథ్యంలో అప్పీళ్లను ఆగస్టు 18కి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. ఇంటర్వూ ప్రక్రియను కొనసాగించి, ఫలితాలు వెల్లడించకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఏపీపీఎస్సీ తరఫు న్యాయవాది ఆర్‌వీ మల్లికార్జునరావు చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అరూప్‌ కుమార్‌ గోస్వామి, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఆదేశాలిచ్చింది. గ్రూప్‌-1 ప్రధాన పరీక్ష జవాబుపత్రాలను ఏపీపీఎస్సీ డిజిటల్‌ విధానంలో దిద్దించడాన్ని సవాల్‌ చేస్తూ వేర్వేరుగా వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ప్రధాన పరీక్ష తిరిగి నిర్వహించేలా ఏపీపీఎస్సీని ఆదేశించాలని, ఇంటర్వ్యూలను నిలువరించాలని పిటిషన్లు అభ్యర్థించిన సంగతి తెలిసిందే.

Updated Date - 2021-07-24T16:07:33+05:30 IST