గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం!
ABN , First Publish Date - 2021-12-07T15:37:59+05:30 IST
ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..
పరస్పర బదిలీలకు ఓకే
జనవరి 4 వరకే అనుమతిస్తూ ఉత్తర్వులు
అమరావతి(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ శాఖల్లో మ్యూచువల్ బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వ శాఖల్లో సాధారణ బదిలీలపై ఉన్న పాక్షిక నిషేధాన్ని సడలిస్తూ ఆదేశాలిచ్చింది. ఈ మేరకు 2022 జనవరి 4వ తేదీ వరకు ఉద్యోగుల పరస్పర బదిలీలకు అంగీకరిస్తూ ఆర్థికశాఖ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. మళ్లీ జనవరి 5 నుంచి నిషేదం కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఉద్యోగ సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుని పరస్పర బదిలీలకు మాత్రమే అంగీకారం తెలిపినట్లు తెలిపింది. పరస్పర బదిలీ కోరుతున్న ఉద్యోగులు ఒకేచోట కనీసం రెండేళ్లు సర్వీసు పూర్తిచేసి ఉండాలన్న నిబంధనను ప్రభుత్వం విధించింది. ఏసీబీ, విజిలెన్స్ కేసులు, ఇతర అభియోగాలు పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల బదిలీల దరఖాస్తులను పరిశీలించబోమని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.