ఉన్నత విద్యా కోర్సుల్లో గాంధీ పాఠాలు!: లింబాద్రి
ABN , First Publish Date - 2021-11-26T14:19:24+05:30 IST
మహాత్మా గాంధీ తత్వాన్ని..

హైదరాబాద్, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): మహాత్మా గాంధీ తత్వాన్ని ఉన్నత విద్యా కోర్సుల్లో పాఠ్యాంశాలుగా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొ.ఆర్.లింబాద్రి చెప్పారు. ఎస్‌డీ సుబ్బారెడ్డి రచించిన ‘విద్యా-గాంధీ తత్వము, వర్తమాన సమాజంలో గాంధీ అభిప్రాయాలు’ పుస్తకాన్ని లింబాద్రి గురువారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. విద్యపై మహాత్మాగాంధీ అభిప్రాయాలను రచయిత పుస్తకంలో చక్కగా వివరించారని లింబాద్రి కొనియాడారు.