7న ఖైరతాబాద్‌‌లో ఉచిత జాబ్‌ ఫెయిర్‌

ABN , First Publish Date - 2021-02-05T16:37:30+05:30 IST

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో ఈ నెల 7వ తేదీన ఉచిత జాబ్‌ఫెయిర్‌ నిర్వహిస్తున్నట్లు ఫ్రాంకోఫైల్‌ ఫ్రెంచ్‌ సంస్థ నిర్వాహకురాలు

7న ఖైరతాబాద్‌‌లో ఉచిత జాబ్‌ ఫెయిర్‌

హైదరాబాద్/ఖైరతాబాద్‌ : నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో ఈ నెల 7వ తేదీన ఉచిత జాబ్‌ఫెయిర్‌ నిర్వహిస్తున్నట్లు ఫ్రాంకోఫైల్‌ ఫ్రెంచ్‌ సంస్థ నిర్వాహకురాలు రుబీనా, సహాయకుడు దానం ఉపేందర్‌  తెలిపారు. ఆలిండియా స్మాల్‌ స్కేల్‌ ఇండస్ర్టీస్‌ మైనారిటీస్‌ కమిటీ సహకారంతో జరగనున్న ఈ ఫెయిర్‌లో దాదాపు 50వరకు సంస్థలు పలు ఉద్యోగాల కోసం నేరుగా ఇంటర్య్వూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఖైరతాబాద్‌ వాసవీ కళ్యాణ మండపంలో ఉదయం 9నుంచి సాయంత్రం 4గంటల వరకు ఈ ఉద్యోగ మేళా ఉంటుందని, రిజిస్ర్టేషన్ల కోసం 9000266171, 9642611347, 7799667138లో సంప్రదించాలని వారు సూచించారు.  


Updated Date - 2021-02-05T16:37:30+05:30 IST