విద్యావ్యవస్థను ముఖ్యమంత్రి కేసీఆర్ నాశనం చేశారు
ABN , First Publish Date - 2021-12-30T20:20:54+05:30 IST
రాష్ట్రంలో విద్య వ్యవస్థను ముఖ్యమంత్రి కేసీఆర్ భ్రష్టు పట్టించారని ఆర్‌టీసీ మాజీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ ఆరోపించారు.

- ఆర్‌టీసీ మాజీ చైర్మన్ ‘సోమారపు’
గోదావరిఖని, డిసెంబరు 29: రాష్ట్రంలో విద్య వ్యవస్థను ముఖ్యమంత్రి కేసీఆర్ భ్రష్టు పట్టించారని ఆర్‌టీసీ మాజీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ ఆరోపించారు. బుధవారం గోదావరిఖని శివాజీనగర్‌లోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాక ముందు విద్య వ్యవస్థను మెరుగుపరుస్తానని చెప్పిన ముఖ్యమంత్రి మాట నిలబెట్టుకోలేదని, గత ఏడాది కేసీఆర్ నిర్వాకం వల్లనే ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారాన్నరు. ఈ ఏడాది కూడా మెరిట్ విద్యార్థులకు అన్యాయం జరిగిందని, దీంతో చాలా మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఉపాధ్యాయుల బదిలీలను తనకు ఇష్టం వచ్చిన రీతిలో చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఇప్పు డు విద్యార్థుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. విలేకరుల సమావేశంలో బీజేపీ నాయకులు గుండబోయిన లక్ష్మణ్‌యాదవ్, పిడుగు కృష్ణ, మంచికట్ల బిక్షపతి, బద్రి దేవేందర్, తడగొండ నర్సయ్య, రవికుమార్, భరత్‌కుమార్, మామిడి వీరేశం, మల్లే షం, చంద్రశేఖర్, వాసు పాల్గొన్నారు.