టీచర్ల కేటాయింపులపై వివరణ ఇవ్వండి

ABN , First Publish Date - 2021-12-15T15:32:17+05:30 IST

కొత్త జిల్లాల వారీగా ఉపాధ్యాయుల కేటాయింపులకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవో 317పై వివరణ ఇవ్వాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి..

టీచర్ల కేటాయింపులపై వివరణ ఇవ్వండి

ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన హైకోర్టు 


హైదరాబాద్‌, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): కొత్త జిల్లాల వారీగా ఉపాధ్యాయుల కేటాయింపులకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవో 317పై వివరణ ఇవ్వాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి మంగళవారం నోటీసులు జారీ చేసింది. ఉపాధ్యాయుల కేటాయింపుపై ప్రభుత్వం జారీ చేసిన జీవో, మార్గదర్శకాలు రాజ్యాంగ వ్యతిరేకమని, గతంలో ఉన్నత న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులకు విరుద్ధమని పేర్కొంటూ ఉపాధ్యాయుడు ఏ మహేందర్‌ సహా పలువురు హైకోర్టులో రిట్‌ పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై ప్రధాన న్యాయమూర్తి సతీశ్‌ చంద్ర శర్మ, జస్టిస్‌ ఎన్‌ తుకారాంజీ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ పిటిషన్లపై కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను 4 వారాలపాటు వాయిదా వేసింది. 

Updated Date - 2021-12-15T15:32:17+05:30 IST