ఉద్యోగులదే ఈ గెలుపు: కారం రవీందర్‌రెడ్డి
ABN , First Publish Date - 2021-03-21T17:24:41+05:30 IST
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలుపు ఉద్యోగులు, ఉద్యమకారులదేనని టీఎన్జీవోల సంఘం పూర్వ అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి..

మార్చి 20(ఆంధ్రజ్యోతి): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలుపు ఉద్యోగులు, ఉద్యమకారులదేనని టీఎన్జీవోల సంఘం పూర్వ అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు, ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు మద్దతు తెలిపారని పేర్కొన్నారు.