ప్రభుత్వంపై ఉద్యోగుల గుర్రు

ABN , First Publish Date - 2021-10-14T14:02:42+05:30 IST

తమ సమస్యల పరిష్కారంలో..

ప్రభుత్వంపై ఉద్యోగుల గుర్రు

సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయాలి: ఆస్కార్‌రావు 


అమరావతి/రాజమహేంద్రవరం అర్బన్‌, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): తమ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ తీరుపైౖ ఉద్యోగులు గుర్రుగా ఉన్నారని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ఆస్కారరావు అన్నారు. ప్రభుత్వం వెంట నే ఉద్యోగ సంఘాల సమావేశం ఏర్పాటు చేసి సమస్యలపై చర్చించాలని బుధవారం ఓ ప్రకటన లో డిమాండ్‌ చేశారు. 2018 నుంచి అమలు చే యాల్సిన 11వ పీఆర్సీ సుమారు 39 నెలలు దా టినా అమలు కావడం లేదని తెలిపారు. ప్రభు త్వం తక్షణమే మెరుగైన వేతన స్కేళ్లతో కూడిన పీఆర్సీని దసరా కానుకగా ఇవ్వాలన్నారు. వారం రోజుల్లో సీపీఎస్‌ రద్దు చేస్తామన్నారని, ఇంత వర కు చేయలేదన్నారు. వైద్యారోగ్యశాఖలో కాంట్రాక్టు పారామెడికల్‌ సిబ్బంది 130 రోజుల నుంచి ఆందోళనలు చేస్తుంటే ప్రభుత్వం ఇప్పటికీ చర్చలకు పిలవలేదన్నారు. తాము సీఎంకు ఇచ్చిన 26 డిమాండ్లపైనా తక్షణమే స్పందించాలన్నారు. సగ టు ఉద్యోగి ఈ విషయాల్లో ప్రభుత్వంపైనా, ఉద్యో గ సంఘాలపైనా గుర్రుగా ఉన్నారన్నారు.


రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన గల ఏపీ సివిల్‌ సర్వీసెస్‌ జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని తక్షణమే ఏర్పాటు చేసి ఉద్యోగ సంఘాలతో చర్చించాలని డిమాండ్‌ చేశారు. ఈ ప్రక్రియ గత 15 ఏళ్లుగా జరగటం లేదని, నానా హంగామా చేస్తూ, మీడియా ముందు అడ్డంగా దొరికిపోయిన ఏపీజేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి దీనికి సమాధానం చెప్పాలన్నారు. బొప్పరాజు, బండి శ్రీనివాస్‌ జేఏసీల పేరుతో సంఘాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. సీఎంవో కార్యాలయం నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి పిలిచారని కొంతమంది ఉద్యోగ సంఘాల నేతలు వ్యవహరిస్తున్న తీరు కామెడీగా మారిందని అన్నారు. 

Updated Date - 2021-10-14T14:02:42+05:30 IST