ఎంసెట్‌లో ‘సాంఘిక సంక్షేమ’ విద్యార్థుల సత్తా

ABN , First Publish Date - 2021-08-27T16:10:31+05:30 IST

టీఎస్‌ ఎంసెట్‌లో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. మొత్తం 1,739 మంది విద్యార్థులు అర్హత సాధించారు. కరోనా వల్ల ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ విద్యార్థులు ఎంసెట్‌

ఎంసెట్‌లో ‘సాంఘిక సంక్షేమ’ విద్యార్థుల సత్తా

అర్హత సాధించిన 1,739 మంది విద్యార్థులు

హైదరాబాద్‌, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): టీఎస్‌ ఎంసెట్‌లో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. మొత్తం 1,739 మంది విద్యార్థులు అర్హత సాధించారు. కరోనా వల్ల ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ విద్యార్థులు ఎంసెట్‌లో రాణించేందుకు ఆన్‌లైన్‌లో ఉత్తమ బోధన అందించామని తెలంగాణ సాంఘిక గురుకుల విద్యాలయాల కార్యదర్శి రొనాల్డ్‌ రాస్‌ తెలిపారు. విద్యార్థులు ప్రణాళిక ప్రకారం చదవడంతో ర్యాంకులు సాధించారన్నారు. ఎంసెట్‌లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులతో పాటు, అధ్యాపక బృందాన్ని రొనాల్డ్‌ రాస్‌ గురువారం అభినందించారు. 95 మంది విద్యార్థులు 5 వేల లోపు అగ్రికల్చర్‌ ఓపెన్‌ కేటగిరిలో ర్యాంకులు సాధించారు. ఇంజనీరింగ్‌లో ఓపెన్‌ కేటగిరీలో 65 మంది విద్యార్థులు వెయ్యి లోపు ర్యాంకులు సాధించారు.


Updated Date - 2021-08-27T16:10:31+05:30 IST