కాంట్రాక్టు జూనియర్‌ లెక్చరర్ల జీతాల విడుదల

ABN , First Publish Date - 2021-09-03T16:19:16+05:30 IST

రాష్ట్రంలో కాంట్రాక్టు జూనియర్‌ లెక్చరర్లకు జూన్‌, జూలై నెలల జీతాల కింద రూ.38.82 కోట్లను గురువారం ఇంటర్మీడియట్‌ బోర్డు కమిషనర్‌

కాంట్రాక్టు జూనియర్‌ లెక్చరర్ల జీతాల విడుదల

రాష్ట్రంలో కాంట్రాక్టు జూనియర్‌ లెక్చరర్లకు జూన్‌, జూలై నెలల జీతాల కింద రూ.38.82 కోట్లను గురువారం ఇంటర్మీడియట్‌ బోర్డు కమిషనర్‌ విడుదల చేశారు. కాంట్రాక్టు జూనియర్‌ లెక్చరర్లకు 3 నెలల నుంచి జీతాల చెల్లింపు నిలిచిపోయిన విషయం తెలిసిందే. కాగా, మోడల్‌ స్కూళ్లలో గంటల ప్రాతిపదికన పనిచేస్తున్న టీచర్ల రెన్యూవల్‌కు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలోని 194 మోడల్‌ స్కూళ్లలో 1,024 మంది టీచర్లు గంటల ప్రాతిపదికన పని చేస్తున్నారు. 

Updated Date - 2021-09-03T16:19:16+05:30 IST