త్వరలో వీఆర్వోల ఆత్మగౌరవ సభ

ABN , First Publish Date - 2021-09-02T14:43:15+05:30 IST

గ్రామ రెవెన్యూ అధికారులకు ప్రభుత్వం చీకట్లను మిగిల్చిందని, దీనిని నిరసిస్తూ అన్ని ఉద్యోగ సంఘాల, రాజకీయ పార్టీల నాయకులతో కలిసి ఈ నెల మొదటి వారంలో ఆత్మగౌరవ సభ నిర్వహించనున్నట్లు తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్ష,

త్వరలో వీఆర్వోల ఆత్మగౌరవ సభ

హైదరాబాద్‌, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): గ్రామ రెవెన్యూ అధికారులకు ప్రభుత్వం చీకట్లను మిగిల్చిందని, దీనిని నిరసిస్తూ అన్ని ఉద్యోగ సంఘాల, రాజకీయ పార్టీల నాయకులతో కలిసి ఈ నెల మొదటి వారంలో ఆత్మగౌరవ సభ నిర్వహించనున్నట్లు తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గోల్కొండ సతీశ్‌ పల్లెపాటి నరేశ్‌లు తెలిపారు. 2020 సెప్టెంబరు 9న  రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయంతో వీఆర్వో వ్యవస్థ రద్దయిందని బుధవారం ఓ ప్రకటనలో వారు పేర్కొన్నారు. రెవెన్యూ శాఖలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, కారుణ్య నియామకాలు జరుపకుండా ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందన్నారు. వీఆర్వో వ్యవస్థను రద్దు చేసి ఏడాది కావస్తున్నా కనీసం వీఆర్వోలకు అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, ఆర్‌ఐలకు ప్రమోషన్లు ఇవ్వడం లేదని, వీళ్లందరికి ప్రమోషన్లు ఇచ్చి వీఆర్వోలకు కూడా పదోన్నతులు కల్పించాలని  డిమాండ్‌ చేశారు.

Updated Date - 2021-09-02T14:43:15+05:30 IST