సాయుధ దళాల పతాక నిధికి విరాళాలివ్వండి

ABN , First Publish Date - 2021-12-07T13:57:19+05:30 IST

సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని మంగళవారం జరుపుకుంటున్న నేపథ్యంలో జెండా దినోత్సవ నిధికి ఉదారంగా విరాళాలిచ్చి సహకరించాలని..

సాయుధ దళాల పతాక నిధికి విరాళాలివ్వండి

గవర్నర్‌ విశ్వభూషణ్‌ పిలుపు


అమరావతి, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని మంగళవారం జరుపుకుంటున్న నేపథ్యంలో జెండా దినోత్సవ నిధికి ఉదారంగా విరాళాలిచ్చి సహకరించాలని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో నివసిస్తున్న మాజీ సైనికులు, వీరనారులు, వీరమాతలు, వారి కుటుంబాలకు సౌకర్యాలు కల్పించేందుకు ఈ నిధిని వినియోగిస్తారని పేర్కొన్నారు. ఈమేరకు సోమవారం రాజ్‌భవన్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. 

Updated Date - 2021-12-07T13:57:19+05:30 IST