అంగన్‌వాడి కేంద్రాల్లో పిల్లలకు కుళ్లిన కోడిగుడ్లు పంపిణీ.. కాంట్రాక్టర్‌పై చర్యలకు డిమాండ్
ABN , First Publish Date - 2021-12-31T20:55:06+05:30 IST
తూర్పుగోదావరి జిల్లాలో అంగన్‌వాడి కేంద్రాల్లో పిల్లలకు పంపిణి చేసిన కోడి గుడ్లు కుళ్ళిపోయాయి. భయంకరమైన దుర్వాసన వస్తుండడంతో బాధితులు గ్రామ సర్పంచ్‌కు

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లాలో అంగన్‌వాడి కేంద్రాల్లో పిల్లలకు పంపిణి చేసిన కోడి గుడ్లు కుళ్ళిపోయాయి. భయంకరమైన దుర్వాసన వస్తుండడంతో బాధితులు గ్రామ సర్పంచ్‌కు ఫిర్యాదు చేశారు. తూర్పు గోదావరి జిల్లా, పిఠాపురం మండలం, గోకివాడలో ఈ ఘటన కలకలం రేపుతోంది. గోకివాడ 61వ నెంబర్‌లోని అంగన్‌వాడి కేంద్రంలో వెలుగుల చక్రరావు పాపకు ఇచ్చిన గుడ్లు పగులగొట్టగా కుళ్లిన వాసన వచ్చింది. దీంతో ఆయన విషయాన్ని సర్పంచ్‌కు ఫిర్యాదు చేశాడు. దీనిపై అంగన్‌వాడి టీచర్‌ను సర్పంచ్ ఆరా తీయగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్‌వాడి కేంద్రంలో నాణ్యతలేని కోడిగుడ్లు పంపిణీ చేస్తూ పిల్లల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారని సర్పంచ్ ఆరోపించారు. అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని గ్రామ సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు. కుళ్లిన కోడిగుడ్లు సరఫరా చేసిన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.