ఏపీ మోడల్ స్కూల్స్ సిబ్బందికి CPS
ABN , First Publish Date - 2021-12-15T14:36:01+05:30 IST
ఏపీ మోడల్ స్కూల్స్‌లో పనిచేస్తున్న రెగ్యులర్ సిబ్బందికి కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అమలుకు మార్గదర్శకాలు జారీచేస్తూ డైరెక్టర్..

అమరావతి, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): ఏపీ మోడల్ స్కూల్స్‌లో పనిచేస్తున్న రెగ్యులర్ సిబ్బందికి కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అమలుకు మార్గదర్శకాలు జారీచేస్తూ డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీ అకౌంట్స్ ఎన్.మోహన్‌రావు మంగళవారం ఉత్తర్వులిచ్చారు. దీనిపై మోడల్ స్కూల్స్ ప్రోగ్రెసివ్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు కోమటిరెడ్డి శివశంకర్‌రెడ్డిలు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.