విద్యా సంస్థల ఐడీ కార్డుతో పిల్లలకు కొవాక్సిన్.. జనవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ మొదలు
ABN , First Publish Date - 2021-12-28T20:13:58+05:30 IST
పిల్లలకు కొవిడ్ వ్యాక్సిన్ అందించాలని నిర్ణయించిన కేంద్రం.. ఆ దిశగా ఏ వ్యాక్సిన్ ఇస్తారో స్పష్టం చేసింది. ప్రస్తుతానికి 15-18 ఏళ్ల పిల్లలకు కొవాక్సిన్ మాత్రమే అందిస్తామని వెల్లడించింది..
![విద్యా సంస్థల ఐడీ కార్డుతో పిల్లలకు కొవాక్సిన్.. జనవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ మొదలు](https://media.andhrajyothy.com/appimg/galleries/1921122802395318/12282021144133n24.jpg)
మూడో డోసులో ‘మిక్సింగ్’ ఉండదు!
తొలి రెండు డోసులు తీసుకున్న టీకానే మూడో డోసుగా..
ఇది బూస్టర్ కాదు.. ప్రికాషన్ డోసు: కొవిన్ చీఫ్ ఆర్ఎస్ శర్మ
న్యూఢిల్లీ, డిసెంబరు 27: పిల్లలకు కొవిడ్ వ్యాక్సిన్ అందించాలని నిర్ణయించిన కేంద్రం.. ఆ దిశగా ఏ వ్యాక్సిన్ ఇస్తారో స్పష్టం చేసింది. ప్రస్తుతానికి 15-18 ఏళ్ల పిల్లలకు కొవాక్సిన్ మాత్రమే అందిస్తామని వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది. క్లినికల్ ట్రయల్స్‌లో మంచి ఫలితాలు రావడంతో.. పిల్లలకు అత్యవసర వినియోగానికి డీసీజీఐ కొవాక్సిన్‌కు ఇటీవల అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే, జైకోవ్-డి టీకాకు కూడా అనుమతులు ఉన్నప్పటికీ.. దీని పంపిణీ ఇంకా మొదలు కాలేదు. ఈ నేపథ్యంలో.. ప్రస్తుతానికి కొవాక్సిన్ మాత్రమే పిల్లలకు అందుబాటులో ఉండనుంది.