సీఎం జగన్ ఆదేశాలిచ్చారు.. పది రోజుల్లో పూర్తవుతుంది..!

ABN , First Publish Date - 2021-11-26T14:56:01+05:30 IST

రాష్ట్ర..

సీఎం జగన్ ఆదేశాలిచ్చారు.. పది రోజుల్లో పూర్తవుతుంది..!

అమరావతి(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ ప్రక్రియ వారం నుంచి 10 రోజుల్లోపు పూర్తి చేసేలా చూడాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అధికారులకు ఆదేశాలిచ్చారని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కే వెంకట్రామిరెడ్డి వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం తరఫున గురువారం ముఖ్యమంత్రిని కలిసినట్టు చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు పూర్తి కాగానే డిసెంబరు మొదటి వారంలోగా ఉద్యోగ సంఘాలను పిలిచి, పీఆర్సీ ప్రక్రియను పూర్తి చేసే బాధ్యత తమదని సీఎంవో అధికారులు కూడా చెప్పారని ఆయన మీడియాకు తెలిపారు.

Updated Date - 2021-11-26T14:56:01+05:30 IST