12 సెంట్రల్‌ వర్సిటీలకు వీసీల నియామకం

ABN , First Publish Date - 2021-07-24T16:13:52+05:30 IST

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌గా ప్రొఫెసర్‌ బసుత్కర్‌ జే రావు (జగదీశ్వర్‌ రావు) నియమితులయ్యారు. 2018 నుంచి తిరుపతిలోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌(ఐఐఎ్‌సఈఆర్‌)లో బయాలజీ ప్రొఫెసర్‌గా వ్యవహరిస్తున్నారు

12 సెంట్రల్‌ వర్సిటీలకు వీసీల నియామకం

న్యూఢిల్లీ/తిరుపతి, జూలై 23 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌గా ప్రొఫెసర్‌ బసుత్కర్‌ జే రావు (జగదీశ్వర్‌ రావు) నియమితులయ్యారు. 2018 నుంచి తిరుపతిలోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌(ఐఐఎ్‌సఈఆర్‌)లో బయాలజీ ప్రొఫెసర్‌గా వ్యవహరిస్తున్నారు. హెచ్‌సీయూతోపాటు దేశంలోని 12 సెంట్రల్‌ యూనివర్సిటీలకు రాష్ట్రపతి ఉపకులపతులను నియమించారు. హైదరాబాద్‌లోని మౌలా నా ఆజాద్‌ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాల యం వీసీగా ప్రొఫెసర్‌ సయీద్‌ ఐనుల్‌ హసన్‌ నియమితులయ్యారు. అలాగే కర్నాటక సెంట్రల్‌ యూనివర్సిటీ వీసీ గా ఓయూ రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ బట్టు సత్యనారాయణను నియమించారు. 

Updated Date - 2021-07-24T16:13:52+05:30 IST