రేపటి నుంచి JNTU కాలేజీల్లో బయోమెట్రిక్‌

ABN , First Publish Date - 2021-10-31T13:04:51+05:30 IST

జవహర్‌లాల్‌నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ..

రేపటి నుంచి JNTU కాలేజీల్లో బయోమెట్రిక్‌

హైదరాబాద్‌, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): జవహర్‌లాల్‌నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ(హెచ్‌) పరిధిలోని ఇంజనీరింగ్‌, ఫార్మసీ తదితర కాలేజీల్లో సోమవారం నుంచి అధ్యాపకులకు, పీజీ విద్యార్థులకు బయోమెట్రిక్‌అటెండెన్స్‌ ప్రక్రియ అమలు కానుంది. బయోమెట్రిక్‌ ద్వారా ప్రతి ఒక్కరూ ఉదయం, సాయంత్రం రెండు పూటలా అటెండెన్స్‌ నమోదు చేసుకోవాలని యూనివర్సిటీ అధికారులు శనివారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.

Updated Date - 2021-10-31T13:04:51+05:30 IST