బీ-కేటగిరీ సీట్లను మెరిట్‌ ప్రకారం భర్తీ చేయాలి

ABN , First Publish Date - 2021-08-20T14:09:48+05:30 IST

ఇంజనీరింగ్‌, ఫార్మసీ కోర్సుల్లోని బీ-కేటగిరీ సీట్లను మెరిట్‌ ప్రకారం కన్వీనర్‌ పరిధిలో భర్తీ చేయాలని ఏబీవీపీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్‌రెడ్డి గురువారం తెలంగాణ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిషన్‌

బీ-కేటగిరీ సీట్లను మెరిట్‌ ప్రకారం భర్తీ చేయాలి

ఇంజనీరింగ్‌, ఫార్మసీ కోర్సుల ప్రవేశాలపై ఏబీవీపీ విజ్ఞప్తి

హైదరాబాద్‌, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్‌, ఫార్మసీ కోర్సుల్లోని బీ-కేటగిరీ సీట్లను మెరిట్‌ ప్రకారం కన్వీనర్‌ పరిధిలో భర్తీ చేయాలని ఏబీవీపీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్‌రెడ్డి గురువారం తెలంగాణ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిషన్‌ చైర్మన్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్‌, ఫార్మసీ కళాశాలల్లో యాజమాన్య కోటా ద్వారా (బీ-కేటగిరీ) 30 శాతం ప్రవేశాలు చేపడుతున్నట్టు చెప్పారు. వీటి భర్తీని ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా చేపట్టాల్సి ఉండగా, అలా జరగడం లేదన్నారు. 

Updated Date - 2021-08-20T14:09:48+05:30 IST