అశోకా వర్సిటీ రాజీనామాలపై దుమారం

ABN , First Publish Date - 2021-03-21T17:05:34+05:30 IST

అశోకా విశ్వవిద్యాలయం నుంచి ప్రొఫెసర్‌ ప్రతాప్‌ భాను మెహతా రాజీనామా, ఆయనకు సంఘీభావంగా కేంద్ర మాజీ ఆర్థిక సలహాదారు ..

అశోకా వర్సిటీ రాజీనామాలపై దుమారం

న్యూఢిల్లీ, మార్చి 20: అశోకా విశ్వవిద్యాలయం నుంచి ప్రొఫెసర్‌ ప్రతాప్‌ భాను మెహతా రాజీనామా, ఆయనకు సంఘీభావంగా కేంద్ర మాజీ ఆర్థిక సలహాదారు అరవింద్‌ సుబ్రమణ్యం నిష్క్రమణ తీవ్ర దుమారానికి దారితీశాయి. రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే వారు రాజీనామా చేశారంటూ అనేక ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయాలకు చెందిన 150 మంది విద్యావేత్తలు ఓ ఉమ్మడి లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతాప్‌ భానుకు సంఘీభావం ప్రకటిస్తున్నట్లు యేల్‌, ఎంఐటీ, స్టాన్‌ఫోర్డ్‌, ఆక్స్‌ఫర్డ్‌, ప్రిన్స్‌టన్‌, కేంబ్రిడ్జి, పెన్సిల్వేనియా, హార్వర్డ్‌, తదితర వర్సిటీలకు చెందిన ప్రొఫెసర్లు లేఖలో పేర్కొన్నారు.

Updated Date - 2021-03-21T17:05:34+05:30 IST