ఈఏపీసెట్‌కు 94.73 శాతం హాజరు

ABN , First Publish Date - 2021-08-20T13:19:24+05:30 IST

ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏపీ ఈఏపీసెట్‌ పరీక్షకు తొలిరోజు గురువారం 94.73 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. రెండు షిఫ్ట్‌లలో కలిపి 36,153 మంది విద్యార్థులు పరీక్ష రా యాల్సి ఉండగా, 34,250

ఈఏపీసెట్‌కు 94.73 శాతం హాజరు

అమరావతి, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏపీ ఈఏపీసెట్‌ పరీక్షకు తొలిరోజు గురువారం 94.73 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. రెండు షిఫ్ట్‌లలో కలిపి 36,153 మంది విద్యార్థులు పరీక్ష రా యాల్సి ఉండగా, 34,250 మంది పరీక్ష రాశారని ఉన్నత విద్యామండలి కార్యదర్శి సుధీర్‌ ప్రేమ్‌కుమార్‌ తెలిపారు. 


28 వరకు డిప్లొమా దరఖాస్తులు

వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య డిప్లొమా కోర్సుల్లో 2021-22లో ప్రవేశాలకు ఈ నెల 28వ తేదీ వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు స్వీరించనున్నారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, డాక్టర్‌ వైఎస్సాఆర్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం, శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం ఈ మేర కు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. 

Updated Date - 2021-08-20T13:19:24+05:30 IST