విద్యార్థులకు గమనిక.. గడువు పెంచారు

ABN , First Publish Date - 2021-10-19T13:47:22+05:30 IST

దరఖాస్తు గడువును..

విద్యార్థులకు గమనిక.. గడువు పెంచారు

NIMS లో హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సుకు దరఖాస్తులు ఆహ్వానం


హైదరాబాద్ సిటీ/సనత్‌నగర్‌ : నిజామ్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (నిమ్స్‌) నిర్వహిస్తోన్న మాస్టర్‌ ఇన్‌ హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌ (ఎంహెచ్‌ఎం) కోర్సుకు దరఖాస్తు గడువును పెంచారు. ఆన్‌లైన్‌లో ఈనెల 30 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 2021-22 విద్యా సంవత్సరానికి ఎంహెచ్‌ఎంలో ప్రవేశం కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నట్టు సంస్ధ అకడమిక్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ మార్త రమేష్‌ తెలిపారు. ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీ ఉన్నవారు అర్హులు. ఆన్‌లైన్‌ దరఖాస్తు హార్డు కాపీ ఈ నెల 30లోగా నిమ్స్‌కు చేరేలా పంపాలని డాక్టర్‌ రమేష్‌ సూచించారు. ఇతర వివరాల కోసం 9642928910, 9010889110 నంబర్లలో సంప్రదించవచ్చు. లేదా నిమ్స్‌ వెబ్‌సైట్‌ చూడవచ్చు.  

Updated Date - 2021-10-19T13:47:22+05:30 IST