పేద విద్యార్థులకు ఎయిడెడ్ వరం
ABN , First Publish Date - 2021-11-26T14:45:53+05:30 IST
‘‘ఎయిడెడ్ విద్యాసంస్థల కొనసాగింపుపై..

గొప్పోళ్లంతా ఒకప్పుడు ఇక్కడ చదువుకున్నోళ్లే: లోకేశ్
దుగ్గిరాల, నవంబరు 25: ‘‘ఎయిడెడ్ విద్యాసంస్థల కొనసాగింపుపై ఆప్షన్ల డ్రామాలు విడిచిపెట్టి ఆయా జీఓలను తక్షణమే రద్దు చేయాలి. ఎయిడెడ్ పేద విద్యార్థుల పాలిట వరం. ఎంతో మంది ఉన్నత స్థితిని పొందిన మేధావులు, గొప్ప వ్యక్తులు సైతం ఒకప్పుడు కుగ్రామాల్లోని ఎయిడెడ్ పాఠశాలల్లో చదివిన వారే’’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామంలోని కేవీఎస్ ఎయిడెడ్ హైస్కూల్‌ను లోకేశ్ గురువారం సందర్శించారు. పాఠశాల విద్యార్థినీ, విద్యార్థులతో లోకేశ్ ముఖాముఖిలో పాల్గొన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో చదివేందుకు తమలాంటి పేద విద్యార్థులకు సాధ్యం కాదని తెలిపారు. లోకేశ్ మాట్లాడుతూ, ఎయిడెడ్ వ్యవస్థను నాశనం చేసేందుకు ప్రభుత్వం తీసుకువచ్చిన 19, 42, 50, 51 నంబరు జీఓలను రద్దు చేసేవరకూ విద్యార్థులు, ఎయిడెడ్ పాఠశాలలు, ఉపాధ్యాయుల తరఫున తాము పోరాటం కొనసాగిస్తామన్నారు.