వ్యవసాయ వర్సిటీ పాలిటెక్నిక్‌లో ప్రవేశానికి గడువు 28 వరకు పెంపు
ABN , First Publish Date - 2021-08-25T16:55:21+05:30 IST
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ పాలిటెక్నిక్‌లో, విశ్వవిద్యాలయం ద్వారా గుర్తింపు పొందిన పాలిటెక్నిక్ కాలేజీల్లో

రాజేంద్రనగర్, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ పాలిటెక్నిక్‌లో, విశ్వవిద్యాలయం ద్వారా గుర్తింపు పొందిన పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశానికి ఆన్‌లైన్ దరఖాస్తు గడువును ఈనెల 28 వరకు పొడిగించారు. రెండు సంవత్సరాల వ్యవసాయ, సేంద్రియ వ్యవసాయ, మూడేళ్ల అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులకు (ఇంగ్లిష్ మీడియం) 2021-22 విద్యా సంవత్సరంలో తెలంగాణ పాలిసెట్ 2021 మెరిట్ ఆధారంగా సీట్లను కేటాయించనున్నారు. కౌన్సెలింగ్ తేదీలను సెప్టెంబరు మొదటి వారంలో వర్సిటీ వెబ్‌సైట్ లో చూడవచ్చని అధికారులు పేర్కొన్నారు.