మధ్యాహ్న భోజనానికి 90 కోట్లు విడుదల!

ABN , First Publish Date - 2021-12-09T15:44:42+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి నిధులను ప్రభుత్వం విడుదల చేసినట్లు తెలుస్తోంది. ఈ పథకం నిర్వాహకులకు 3 నెలలుగా..

మధ్యాహ్న భోజనానికి 90 కోట్లు విడుదల!

హైదరాబాద్‌, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి నిధులను ప్రభుత్వం విడుదల చేసినట్లు తెలుస్తోంది. ఈ పథకం నిర్వాహకులకు 3 నెలలుగా బిల్లులు, కార్మికుల వేతనాలు రూ.100 కోట్లకు పైగా పెండింగ్‌లో ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా వారు గత కొద్దిరోజులుగా వంట చేయకుండా సమ్మెకు దిగడం తెలిసిందే. ఈ అంశంపై ‘ఆంధ్రజ్యోతి’ బుధవారం ‘బడి బువ్వ వండేదెలా?’ శీర్షికన ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. అయితే కార్మికుల ఆందోళనల నేపథ్యంలో బకాయిల చెల్లింపునకు ప్రభుత్వం రూ.90 కోట్లు విడుదల చేసినట్లు తెలిసింది. ఒకటి రెండు రోజుల్లో ఈ నిధులు కార్మికులకు అందనున్నట్లు సమాచారం.

Updated Date - 2021-12-09T15:44:42+05:30 IST