అంబేడ్కర్ బొమ్మతో కొత్త వెయ్యి నోటు

ABN , First Publish Date - 2021-11-09T05:50:46+05:30 IST

మోదీ సర్కార్‌ 2016లో అనూహ్యంగా నోట్ల రద్దు ప్రకటించి సరిగ్గా ఐదేళ్లు నిండాయి. అందులో భాగంగా రద్దు చేసిన వెయ్యి రూపాయల నోటును మళ్లీ ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ముద్రించలేదు....

అంబేడ్కర్ బొమ్మతో కొత్త వెయ్యి నోటు

మోదీ సర్కార్‌ 2016లో అనూహ్యంగా నోట్ల రద్దు ప్రకటించి సరిగ్గా ఐదేళ్లు నిండాయి. అందులో భాగంగా రద్దు చేసిన వెయ్యి రూపాయల నోటును మళ్లీ ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ముద్రించలేదు. దాని స్థానంలో కొత్తగా రెండువేల నోటును ఆర్బీఐ విడుదల చేసినప్పటికీ ప్రస్తుతం ఆ నోటు ఎక్కువగా వినియోగంలో లేదు. వ్యాపార చెలామణిలో కూడా ఆ నోటు అంతంత మాత్రమే కనిపిస్తోంది. రెండువేల నోటును తిరిగి ముద్రించడం లేదని కేంద్రప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. దీంతో ఆ నోటును కూడా ప్రభుత్వం రద్దు చేస్తున్నట్లు పుకార్లు వెలువడి దాని వాడకం పూర్తిగా తగ్గిపోయింది. నోట్లరద్దు అనంతరం తిరిగి వెయ్యి రూపాయల నోటును ప్రభుత్వం ముద్రించకపోవడం వల్ల వ్యాపార లావాదేవీల్లో ఒక రకమైన అసౌకర్యం, ఇబ్బంది ఏర్పడింది. కరెన్సీపై ప్రపంచ మేధావి అంబేడ్కర్‌ ఫోటో ముద్రించాలని చాలాకాలంగా భారత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వారి డిమాండ్‌ను, వ్యాపారుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే అంబేడ్కర్‌ బొమ్మతో కొత్త వెయ్యి రూపాయల నోటుని ముద్రించి విడుదల చేయాలి.

పసునూరి శ్రీనివాస్

మెట్‌పల్లి

Updated Date - 2021-11-09T05:50:46+05:30 IST