ప్రజల డబ్బుతో మోసపూరిత ప్రకటనలు!

ABN , First Publish Date - 2021-11-09T05:48:28+05:30 IST

గతంలో ప్రతిపక్షంలో ఉండగా, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో పెట్రో ధరల బాదుడుపై విమర్శల వర్షం గుప్పించి, తాను అధికారంలోకి వస్తే వాటిని...

ప్రజల డబ్బుతో మోసపూరిత ప్రకటనలు!

గతంలో ప్రతిపక్షంలో ఉండగా, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో పెట్రో ధరల బాదుడుపై విమర్శల వర్షం గుప్పించి, తాను అధికారంలోకి వస్తే వాటిని తగ్గిస్తానని నమ్మబలికారు! అధికారంలోకి వచ్చాక ధరలు తగ్గించకపోగా వాట్ మరింతగా పెంచి ప్రజలపై అదనపు భారాన్ని మోపారు. అలాగే నిర్మాణాలను అర్ధంతరంగా ఆపి కూడా రాజధాని అమరావతి సెస్సును కూడా యథాతథంగా వసూలు చేస్తున్నారు. ప్రక్క రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలోనే పెట్రోల్, డీజిల్ ధరలు అత్యధికంగా ఉన్నాయి. కేంద్రం ధరలు పెంచిన ఏ సందర్భంలోనూ ప్రభుత్వం, అధికారపక్షం అభ్యంతరం ప్రకటించలేదు. వాస్తవం ఇదైతే ఇప్పుడు కేంద్రాన్ని, గత ప్రభుత్వాన్నీ నిందిస్తూ పత్రికలలో భారీ ప్రకటనలు గుప్పించడం విచిత్రంగా ఉంది! 

జాస్తి గోపాలప్రసాద్‌

Updated Date - 2021-11-09T05:48:28+05:30 IST