ఎవరు ద్రోహులు, ఎవరు సిగ్గుపడాలి?

ABN , First Publish Date - 2021-12-16T06:08:35+05:30 IST

‘సీమ ద్రోహుల్లారా.. సిగ్గుందా?’ అన్న శీర్షికతో అధికార పార్టీకి చెందిన దినపత్రిక ఇటీవల ఒక వార్త ప్రచురించింది. అమరావతి రాజధాని పరిరక్షణకై సాగుతున్న మహాపాదయాత్రను బలపరుస్తున్న రాయలసీమ ప్రజలను...

ఎవరు ద్రోహులు, ఎవరు సిగ్గుపడాలి?

‘సీమ ద్రోహుల్లారా.. సిగ్గుందా?’ అన్న శీర్షికతో అధికార పార్టీకి చెందిన దినపత్రిక ఇటీవల ఒక వార్త ప్రచురించింది. అమరావతి రాజధాని పరిరక్షణకై సాగుతున్న మహాపాదయాత్రను బలపరుస్తున్న రాయలసీమ ప్రజలను, అన్ని ప్రతిపక్ష పార్టీల నాయకులను - శ్రేణులను, సామాజిక ఉద్యమకారులను ఉద్దేశించి, నిందిస్తూ రాసిన వార్త అది.  


‘‘రాష్ట్రం నడిబొడ్డులో రాజధాని ఉండాలి. రాజధాని నిర్మాణానికి 30వేల ఎకరాల భూమి కావాలి. నీరు పుష్కలంగా లభించే ప్రాంతంలో రాజధాని ఉండాలి. సచివాలయం, శాసనసభ, హైకోర్టు ఉన్నదాన్నే రాజధాని అంటారు. అమరావతిని రాజధానిగా మనస్ఫూర్తిగా బలపరుస్తున్నా’’. ఆణిముత్యాల్లాంటి ఈ మాటలు మాట్లాడింది ఒకనాటి ప్రతిపక్ష నాయకుడు, నేటి రాష్ట్ర ముఖ్యమంత్రే కదా? మరి, ఆయన కూడా సీమ ద్రోహేనా? చట్టసభలు ఏకగ్రీవంగా తీర్మానం చేసి అమరావతిని రాజధానిగా నిర్ణయించి, 29వేల మంది రైతుల నుండి 34వేల ఎకరాల భూములను సేకరించి, వేలకోట్లు వ్యయం చేసి, వివిధ దశల్లో భవన సముదాయాల నిర్మాణాలు ఏర్పడివున్న నేపథ్యంలో, జగన్మోహన్ రెడ్డి అమరావతి నుండి రాజధానిని విశాఖపట్నానికి తరలిస్తానంటూ విధ్వంసకర విధానాలు అమలు చేస్తుంటే ప్రజలు సమర్థించాలా? సమర్థించకపోతే సీమ ద్రోహులా? అమరావతే మన రాష్ట్ర రాజధాని అంటే సీమ ద్రోహులని దుర్భాషలాడే వారి సంకుచిత రాజకీయాలను అర్థం చేసుకొనే విజ్ఞత రాయలసీమ ప్రజలకు ఉన్నది. కరువు పీడిత రాయలసీమ సమగ్రాభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం -2014 మేరకు హక్కుగా రాబట్టుకోవలసిన అంశాలు, కృష్ణానదీ జలాల హక్కులను పరిరక్షించుకొంటూ, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేసుకోవడంపై దృష్టిసారించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మనం పోరాడాలి.

టి.లక్ష్మీనారాయణ, సామాజిక ఉద్యమకారుడు


Updated Date - 2021-12-16T06:08:35+05:30 IST