నిర్బంధమే ఇక మరణమా?
ABN , First Publish Date - 2021-07-10T06:50:12+05:30 IST
అంతరంగం ఆరాటంలో ఇపుడు ఉపఖండం అంతరాత్మ సంజాయిషీ బోనులో నిలుచున్న...
అంతరంగం ఆరాటంలో ఇపుడు
ఉపఖండం అంతరాత్మ
సంజాయిషీ బోనులో నిలుచున్న
ఈ రాజ్యాన్ని ఈ న్యాయవ్యవస్థను
‘కన్ఫెషన్’ చేసుకోమంటున్నాడు ఫాదర్ స్టాన్‘జన’స్వామి!
జనం గొంతులుగా నినదించేవారినంతా
మృత్యుగుయ్యారాల్లో
ఇంకెంతకాలం నిర్బంధిస్తారని
దేశం నిలదీస్తున్నది పాలకులని!
బలుపుతో విర్రవీగే ఆధిపత్యమంతా
సమాధి చేస్తున్నది నైతికవిలువలను,
మానవహక్కుల శవాల మీదుగా
మేళతాళాలతో ఊరేగుతూనే ఉంది రాజ్యహింస
పెత్తనాన్ని పల్లెత్తుమాటన్నా 124ఏ రాజ్రదోహనేరమే!
రాజ్యాంగమిచ్చిన ‘ఆదేశికా’లన్నీ
ఊచలు లెక్కపెట్టవలసిందేనా?
ఇకనైనా అసమ్మతిస్వరాలన్నీ
మూకుమ్మడిగా మారుమోగవలసిందే!!
-నిఖిలేశ్వర్