బొకే కన్నా మొక్కే మిన్న!

ABN , First Publish Date - 2021-12-29T09:02:08+05:30 IST

నూతన సంవత్సర వేడుకల సమయం ఆసన్న మైంది. ఇదే గాక ఎన్నో వివాహాది శుభకార్యాలకు వంద నుంచి వెయ్యి రూపాయలకైనా ఒక ఫ్లవర్ బొకేని కొనుక్కొని వెళ్లి అభినందనలు తెలియ జేయటం...

బొకే కన్నా మొక్కే మిన్న!

నూతన సంవత్సర వేడుకల సమయం ఆసన్న మైంది. ఇదే గాక ఎన్నో వివాహాది శుభకార్యాలకు  వంద నుంచి వెయ్యి రూపాయలకైనా ఒక ఫ్లవర్ బొకేని కొనుక్కొని వెళ్లి అభినందనలు తెలియ జేయటం మన అలవాటుగా మారింది. కానీ ఎంత ఖర్చు పెట్టి కొన్నా ఒక ఫ్లవర్ బొకే జీవితకాలం కొన్ని గంటలు మాత్రమే. ఫ్లవర్ బొకేకి బదులు ఇరవై–ముప్పై రూపాయలతో ఒక మొక్క కొని బహుమతిగా ఇచ్చి అభినందనలు తెలపండి. పచ్చని మొక్కల్లా పది కాలాలపాటు వారు, వారి కుటుంబాలు పచ్చగా వుండాలని దీవించడి. మీరు ఇచ్చిన మొక్క పూచినంత కాలం, కాచినంత కాలం వారికి గుర్తొస్తునే వుంటారు. పర్యావరణ పరిరక్షణతో పాటు, పది రకాల జీవులు బ్రతుకుతాయి/రక్షింపబడుతాయి. -

సాయిప్రకాష్, విశాఖపట్నం.

Read more