ఋణ నిబంధనలు మార్చాలి
ABN , First Publish Date - 2021-08-04T06:00:10+05:30 IST
దరఖాస్తు చేసుకున్న ఒక గంట వ్యవధిలోనే ఋణాలను మంజూరు చేసేలా బ్యాంకింగ్ నిబంధనలను సరళతరం చేస్తామని గత మార్చి 2021లో ఆర్థిక శాఖ ప్రకటించింది...
దరఖాస్తు చేసుకున్న ఒక గంట వ్యవధిలోనే ఋణాలను మంజూరు చేసేలా బ్యాంకింగ్ నిబంధనలను సరళతరం చేస్తామని గత మార్చి 2021లో ఆర్థిక శాఖ ప్రకటించింది. అయినా నేటి వరకు తదనుగుణమైన చర్యలు తీసుకోలేదు. ఋణాల కోసం దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా సందర్భాల్లో దరఖాస్తు చేసుకుని నాలుగు నెలలు అవుతున్నా వాటిని పట్టించుకోకుండా బ్యాంకులు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నాయి. దీంతో నిరాశ చెందిన వారు తమ ప్రయత్నాలను విరమించుకుంటున్నారు నిరుద్యోగులకు, చిరు వ్యాపారులకు, చిన్న వ్యాపారసంస్థలకు అతి తక్కువ వడ్డీతో వెంటనే ఋణాలను మంజూరు చేసేలా ఆర్థికశాఖ తక్షణం బ్యాంకులకు మార్గదర్శకాలను విడుదల చేయాలి.
ఉప్పలపు శేషునాథ్, పి.నైనవరం