స.హ. చట్టాన్ని రక్షించండి!

ABN , First Publish Date - 2021-12-31T07:35:58+05:30 IST

ఎందరో మహానుభావులు, దేశభక్తుల త్యాగఫలితంగా లభించిన స్వతంత్ర్యాన్ని రక్షించుకొనే అవకాశమిచ్చింది ఆర్టీఐ ఏక్ట్ 2005. నేటి పాలకులు తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు...

స.హ. చట్టాన్ని రక్షించండి!

ఎందరో మహానుభావులు, దేశభక్తుల త్యాగఫలితంగా లభించిన స్వతంత్ర్యాన్ని రక్షించుకొనే అవకాశమిచ్చింది ఆర్టీఐ ఏక్ట్ 2005. నేటి పాలకులు తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఈ చట్టం పని చేయకుండా చేసేందుకు అన్ని రకాల దుష్ట పన్నాగాలను పన్నుతున్నారు. కనుక తక్షణం బాధ్యత ఎరిగిన భారత పౌరులు చట్టానికి రక్షణ కల్పించుకునేందుకు అన్ని ప్రయత్నాలూ చేయాలి. ఒక స్వతంత్ర అధికారిక న్యాయ వ్యవస్థ చేత PIO/SIC/ CIC పదవులకు నీతివంతులైన యువ ఐఏఎస్/ ఐపీఎస్ అధికారులను నియమించాలి. రాజకీయ అంతేవాసులను నియమించి చట్టాన్ని అపహాస్యం చేయటం తగదు. చట్ట ప్రకారం కేంద్ర ప్రభుత్వం 963 శాఖలు కలిగివుండగా 42 మాత్రమే చట్టం పరిధిలోకి రావడం ఒక విడ్డూరమైన విషయం. ఇకనైనా మన రాష్ట్ర/ కేంద్ర ప్రభుత్వ పాలకులు గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్‌ల త్యాగాలను స్మరించుకొంటూ సమాచార హక్కు చట్టాన్ని అమలు జరిపేందుకు ముందుకొస్తారని ఆశిద్దాం.

డా. రావెళ్ళ వెంకట రామారావు, ఖమ్మం

Updated Date - 2021-12-31T07:35:58+05:30 IST