అఖిల భారత సేవ్ ఎడ్యుకేషన్ మహాసభలు

ABN , First Publish Date - 2021-10-28T07:45:24+05:30 IST

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానం–-2020, విద్యావ్యవస్థను మరింత భ్రష్టుపట్టించేదిగా..

అఖిల భారత సేవ్ ఎడ్యుకేషన్ మహాసభలు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానం–-2020, విద్యావ్యవస్థను మరింత భ్రష్టుపట్టించేదిగా ఉన్నందున అఖిల భారత విద్యా పరిరక్షణ కమిటీ (AISEC) ఆధ్వర్యంలో ఈ నెల 30, 31 తేదీలలో సేవ్ ఎడ్యుకేషన్ మహాసభలు జరుగనున్నాయి. ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై కేంద్రాల నుంచి ఆఫ్-లైన్, ఆన్-లైన్ ద్వారా జరిగే ఈ సభలలో ప్రముఖ చరిత్రకారులు, ప్రొఫెసర్లు ఇర్ఫాన్ హబీబ్, రోమిలా థాపర్, ఎ.కరుణానందన్, ఆదిత్య ముఖర్జీ, యూజీసీ పూర్వ ఛైర్మెన్ సుఖదేవ్ థోరట్, వివిధ యూనివర్శిటీల పూర్వ వైస్-ఛాన్సలర్లు ఎల్. జవహర్ నేసన్, చంద్రశేఖర్ చక్రవర్తి, తపధీర్ భట్టాచార్య, పశ్చిమబెంగాల్ మాజీ అడ్వొకేట్ జనరల్ బిమల్ ఛటర్జీ, జే‌ఎన్‌యూ సచ్చిదానంద సిన్హా తదితరులు ప్రసంగిస్తారు. దేశవ్యాప్తంగా సేవ్ ఎడ్యుకేషన్ ఉద్యమాన్ని సంఘటితం చేసే లక్ష్యంతో జరుగుతున్న ఈ మహాసభలకు విద్యారంగంతో సంబంధం ఉన్న వారందరూ హాజరు కావాలి. ప్రత్యక్షంగా ఈ సభలలో పాల్గొనడానికి కుదరని వారు ‘ఆల్ ఇండియా సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ’ అనే పేరుతో ఉన్న ఫేస్‌బుక్‌ పేజీ ద్వారా లేదా యూట్యూబ్ ద్వారా వీక్షించవచ్చు. 

– ఎస్‌. గోవిందరాజులు

Updated Date - 2021-10-28T07:45:24+05:30 IST