అధూరె..

ABN , First Publish Date - 2021-02-01T05:50:01+05:30 IST

ఆదా బత్తి జల్‌ గయె ఏ జామో పిల్లి లేచిపోయె టూరు టేస్ట్‌ మస్తుగుందిగని కాలా దాల్‌లో రోటీ ముంచవోయ్‌!...

అధూరె..

ఆదా బత్తి జల్‌ గయె

ఏ జామో పిల్లి లేచిపోయె

టూరు టేస్ట్‌ మస్తుగుందిగని

కాలా దాల్‌లో రోటీ ముంచవోయ్‌!

కాలంతో కలబడ్డావుగని

కేరళ నూనెలు పట్టించి

కేదారంలో గోల పెట్టవోయ్‌!

సాంతం మీదికి వొంగి

ప్రియమైన నిన్ను ముద్దాడవోయ్‌!


పులిని నడ్డివిరిసి

గిలిని బగాయించినవులే..

గిల్లీదండాలో నువ్వే ఎగిరిపడి

ఆమె కళ్లలోకి ఎగబడ్డావులే...

అల్లి కంటి దారాలను

చేరగలవా నీ పిల్లల కలల్లోకి మెల్లిగా...


పెద్ద చెప్పొచ్చావుగని..

ఆదా బత్తి జల్‌ గయె

ఆరే ప్యారే దిల్‌ఽధారే..

ఏ జామో పిల్లి లేచిపోయె!


రివేరా


Updated Date - 2021-02-01T05:50:01+05:30 IST