రన్నింగ్‌ ప్రాక్టీసులో గుండెపోటు.. యువకుడి మృతి

ABN , First Publish Date - 2021-01-12T09:23:55+05:30 IST

పోలీసు ఉద్యోగంలో చేరి తన లక్ష్యాన్ని చేరుకోవాలని వచ్చిన ఓ యువకుడు అందుకోసం రన్నింగ్‌ ప్రాక్టీసు చేస్తూ గుండెపోటుతో కుప్పకూలిపోయి మృతి చెందాడు

రన్నింగ్‌ ప్రాక్టీసులో గుండెపోటు.. యువకుడి మృతి

కవాడిగూడ, (ఆంధ్రజ్యోతి): పోలీసు ఉద్యోగంలో చేరి తన లక్ష్యాన్ని చేరుకోవాలని వచ్చిన ఓ యువకుడు అందుకోసం రన్నింగ్‌ ప్రాక్టీసు చేస్తూ గుండెపోటుతో కుప్పకూలిపోయి మృతి చెందాడు. వనపర్తి జిల్లా అమర చింత మండలం నందిమల్ల గ్రామానికి చెందిన జె.సంతోష్‌ రెడ్డి(24) పోలీస్‌ ఉద్యోగం కోసం శిక్షణ తీసుకోవడానికి వారం క్రితం నగరానికి వచ్చాడు. శిక్షణలో భాగంగా ప్రతి రోజు ఎన్టీఆర్‌ స్టేడియంలో రన్నింగ్‌ చేసేవాడు. సోమవారం స్టేడియానికి వచ్చిన సంతోష్‌ రన్నింగ్‌ చేస్తూనే కుప్పకూలిపోయాడు.  ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. 

Updated Date - 2021-01-12T09:23:55+05:30 IST