అదృశ్యమైన మహిళ ప్రియుడితో కలిసి ఆత్మహత్య!

ABN , First Publish Date - 2021-01-13T12:09:14+05:30 IST

అదృశ్యమైన మహిళ ప్రియుడితో కలిసి ఆత్మహత్య చేసుకుంది.

అదృశ్యమైన మహిళ ప్రియుడితో కలిసి ఆత్మహత్య!

హైదరాబాద్/బర్కత్‌పుర : అదృశ్యమైన మహిళ ప్రియుడితో కలిసి ఆత్మహత్య చేసుకుంది. చెప్పల్‌బజార్‌లో నివాసముంటున్న ఓ ప్రైవేట్‌ ఉద్యోగి తన భార్య(23) ఈ నెల 11న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదని కాచిగూడ పోలీసుస్టేషన్‌లో మంగళవారం ఫిర్యాదు చేశాడు. సమీపంలో ఉన్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఆటో డ్రైవర్‌ హనుమంతు(23) ఇంటికి మహిళ వెళ్లింది. గురువారం రాత్రి ప్రియుడు హనుమంతు ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోగా, మహిళ నిద్రమాత్రలు మింగి చనిపోయింది. 


సమాచారం అందుకున్న కాచిగూడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇద్దరి మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు వీరిద్దరూ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వారు ఆత్మహత్య చేసుకున్నారా...? లేక ఎవరైనా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారా అనేదానిపై పోలీసులు దృష్టి పెట్టారు.

Updated Date - 2021-01-13T12:09:14+05:30 IST